ప్రజాశక్తి - ఆదోని
టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తూ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శనివారం మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఆదోనిలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 'మేము సైతం' అంటూ క్రిస్టియన్లు అమర్ ప్రకాష్, రాయ నగర్ విజరు, మహాత్మ గాంధీ నగర్ విజరు, విరుపాపురం సోమనాథ్, రత్నం, చిన్నహరివాణం సుధాకర్, చెన్నప్ప, హెచ్.చిన్న మారెన్న, రాజేష్, జి.జగదీష్ సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. చర్చి పాస్టర్లు దీక్ష శిబిరం వద్దకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. న్యాయం తప్పకుండా జరుగుతుందని, ఆలస్యం కావచ్చుగాని ఎసిబి కోర్టులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో నలుగురు సీనియర్ న్యాయవాదులు న్యాయం కోసం పోరాడుతున్నారని తెలిపారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, నాయకులు రామస్వామి, స్వామి నాయుడు, చిట్టిబాబు, బాలరాజు, శివప్ప, శంకర్, సజ్జాద్, సాధుల్లా, అల్తాఫ్, మాజీ కౌన్సిలర్లు బాలాజీ, నరసింహులు, కృష్ణారెడ్డి, ఆరెకల్ రామకృష్ణ, దొడ్డనకేరి రవి, గోవిందప్ప, ఎల్లప్ప, సోమన్న, బసవరాజు, లోక్‌నాథ్ రెడ్డి, రంగన్న, లక్ష్మీనారాయణ, జయరాం, మల్లికార్జున, జగదీష్ పాల్గొన్నారు.
ఆదోనిలో మాట్లాడుతున్న మీనాక్షి నాయుడు










