ప్రజాశక్తి-రేపల్లె: బాబూ జగ్జీవన్‌రాం సేవలు చిరస్మరణీయమని టిడిపి నాయకులు క్రాంతి సుమన్‌బాబు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో జగ్జీవన్ రావు 37వ వర్థంతిని పురస్కసరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్రాంతి సుమన్ బాబు మాట్లాడుతూ జగ్జీవన్‌రాం, అంబేడ్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో యువత నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. జగ్జీవన్‌రాం స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమత వాదిగా భారతదేశానికి సేవలను అందించారని చెప్పారు. కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన నేత అని కొనియాడారు. నేడు ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడు తున్న ప్రావిడెంట్ ఫండ్ రూపకర్త బాబూ జగ్జీవన్ రాం అని తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారని తెలిపారు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్‌రామ్ అని పేర్కొన్నారు. భారతదేశంలో వలసవాదా నికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్య్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేశారని చెప్పారు. కార్యక్రమంలో కూచిపూడి మోహనరావు, ఆలూరి డానియెల్, దున్నా జయప్రద, ఆలూరి సురేష్, నున్న జయరావు, చిలకా చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
భట్టిప్రోలు: మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం వర్థంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబా పలువురు టిడిపి నాయకులు, దళిత నాయకు లు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాచూరు గ్రామంలో జగ్జీవన్‌రాం విగ్రహానికి దళిత నాయకులు చిలకా రత్నబాబు ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుక్కల వెంకటేశ్వరరావు, కంభం సుధీర్, రవి తదితరులు ఉన్నారు.
చీరాల: అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన డాక్టర్ బాబూ జగ్జీవన్‌రాం మహనీయుడని ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షులు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య మాదిగ అన్నారు. గురువారం ఆయన 37వ వర్థంతి సందర్భంగా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో ఉన్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి చీరాల బాబూ జగ్జీవన్‌రాం విగ్రహ నిర్మాణ కమిటీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ విద్యార్థి సమాఖ్య, మాదిగ ఉద్యోగు ల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పి బాపట్ల జిల్లా అధ్యక్షులు బుడం గుంట్ల లక్ష్మీనరసయ్య మాదిగ, జిలకర రమేష్, ఉసురుపాటి సురేష్, దుడ్డు సైమన్, వీరమల్లు కోటేశ్వరరావు, దుడ్డు వందనం, ఎంఈఎఫ్ నాయకులు దుడ్డు వెంకటేశ్వర్లు, కొమ్మూరు లైమ్, ఎంఆర్పిఎస్ నాయకులు తేళ్ల అవినాష్, దుడ్డు రాంబాబు, అప్పారావు పాల్గొన్నారు.
బాపట్ల: మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ బహుజన బంధువు అని బాపట్ల ఏబీఎం ప్రాపర్టీస్ ప్రొటక్షన్ కమిటీ అధ్యక్షులు జాన్ ప్రసన్నబాబు అన్నారు. గురువారం జగ్జీవన్‌రాం 37వ వర్థంతి సందర్భంగా బాపట్ల ఏబీఎం హైస్కూల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు పఠాన్ రాజేష్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్‌రాం కేంద్ర వ్యవసాయ మంత్రిగా, కరువు, దుర్భిక్ష పరిస్థితులలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించి దేశాన్ని హరిత విప్లవం దిశగా నడిపించారన్నారు. కేంద్ర పౌరసరఫరాల మంత్రిగా, సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు చౌకగా లభించేలా పౌర సరఫరా పంపిణీ వ్యవస్థను ఆనాడే ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బక్కా రోశయ్య, కాంగ్రెస్ నాయకులు దోనేపూడి రవి, జి సుగంధర్, డేవిడ్, రాంబాబు పాల్గొన్నారు.










