Jul 06,2023 21:06

జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న డిప్యూటీ సిఎం

కడప : జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయమని ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి అంజాద్‌ బాష కొని యాడారు. గురువారం బాబు జగ్జీవ న్‌రామ్‌ 37వ వర్ధంతి సంద ర్భంగా స్థానిక నగరంలోని మహావీర్‌ సర్కిల్‌ వద్ద జగ్జీవన్‌ రామ్‌ విగ్రహా నికి నగర మేయర్‌ కె. సురేష్‌ బాబుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ బాబు దేశ ఉపప్రధానిగా, కార్మిక శాఖామంత్రి గా,వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంటులో సుదీ ర్ఘంగా పనిచేసిన పార్లమెంట్‌ సభ్యునిగా చరిత్రలో నిలిచిన మహనీయుడన్నారు. బడుగు ,బలహీన వర్గాలు అభ్యున్నతికి కషి చేసిన మహానేత అన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి కార్మిక చట్టాల్లో, వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి బడుగు,బలహీన వర్గాలు ప్రజల కు ఆశాజ్యోతి గా నిలిచారన్నారు. ఎఎఫ్‌ఎయులో.. కడప అర్బన్‌ : స్వాతంత్య్ర సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్‌ రామ్‌ అని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వి సి ప్రొఫెసర్‌ బి.అంజనేయ ప్రసాద్‌ అన్నారు. గురువారం నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ లో బాబు జగ్జీవన్‌ రామ్‌ 37 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టర్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి, నేషనల్‌ ఈవెంట్‌ కోఆర్డినేటర్‌ మనోహర్‌, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.