Nov 28,2022 23:58

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

ప్రజాశక్తి -పాయకరావుపేట:బాబు జగ్జీవన్‌ రామ్‌ కి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు. పాయకరావుపేట మండలంలోని పాల్తేరు, సత్యవరంలో భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్‌ రామ్‌ ఐదు దశాబ్దాల పాటు ఈ దేశానికి సేవలు అందించారన్నారు. కార్మిక శాఖలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన ఘనత బాబు జగ్జీవన్‌ రామ్‌కు దక్కుతుందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, ఫూలే, జగ్జీవన్‌ రావ్‌ వంటి మహానీయులు మన దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, మండల విద్యాశాఖ అధికారి కేఎన్‌ గాంధీ, రాష్ట్ర లెదర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వేమగిరి లక్ష్మణరావు, వాల్తేరు గ్రామ పెద్దలు దేవర రాజబాబు, యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాజు, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు తుమ్మలపల్లి కుమార్‌, ఖండింపల్లి నాగేశ్వరరావు, నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.