Oct 31,2023 23:34

ప్రజాశక్తి - యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆయా మండలాల్లో స్వీట్లు పంపిణీ చేశారు.రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో పలు ప్రాంతల్లో ఆయనకు టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రాజమహేంద్రరం స్థానిక సెంట్రల్‌ జైలు వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేశారు. ముందే దీపావళి వచ్చిందన్నట్లుగా భారీ ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. చాగల్లు చంద్రబాబు బెయిల్‌ రావడంపై ఆ పార్టీ శ్రేణులు చాగల్లు మెయిన్‌ బజారులో సంబరాలు చేసుకున్నారు. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాదెళ్ల శ్రీరాం చౌదరి, కోడూరి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దేవరపల్లి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గద్దె సుబ్రహ్మణ్యం, కాట్రు భీమరాజు, కరటూరి శ్ర్రీను, కె.రవికుమార్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాళ్లపూడి చంద్రబాబు బెయిల్‌పై బయటకు రావడంపై టిడిపి శ్రేణులు మండలంలో సంబరాలు చేసుకున్నారు. మండల శాఖ అధ్యక్షులు నామన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో తాళ్లపూడిలో బాణాసంచా కాల్చి, కేక్‌కట్‌ చేశారు. అన్నదేవరపేటలో యువగళం జిల్లా నాయకులు కాకర్ల సత్యేంద్ర, తాడిపూడిలో నామ సురేంద్ర, పోచారంలో అనపర్తి ప్రసాద్‌ల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. పెరవలి జైలు నుంచి విజయవాడ వెళ్తున్న చంద్రబాబుకు పెరవలి జాతీయ రహదారి వద్ద మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బి.శ్రీనివాసరావు, రవివర్మ, ఎ.రామకష్ణమ్మ(శ్రీను), బి. రామాం జనేయులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే నల్లకులవారిపాలెం సెంటర్‌ వద్ద నిడదవోలు నియోజకవర్గం సీనియర్‌ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎ.వెంకటనారాయణ, పి.ప్రసాద్‌, బి.వెంకట నారాయణ, ఇ.సత్యనారాయణ, ఎ.వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారి కూడలి వద్ద టిడిసి, జనసేన శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్‌ ఆయనకు అభివాదం చేసి కరచాలనం చేశారు. గోపాలపురం మండలంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు జరుపుకున్నారు. వేల చింతలగూడెం గ్రామంలో చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కె.రాము, కె.అన్నవరం, ఎ.మంగారావు, ఎం.రమేష్‌, జె.శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.