Sep 16,2023 23:15

ప్రజాశక్తి - యంత్రాంగం చంద్రబాబు అరెస్టుపై జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు కొనసాగాయి. కాకినాడ మాజీ మేయర్‌ సుంకర పావని ఆధ్వర్యాన కాకినాడ సంతచెరువు సెంటర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నల్ల జెండాలు, ప్లకార్డులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్‌ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు బాలాజీ చెరువు సెంటర్‌లోరిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షా శిబిరంలో టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ప్రసంగించారు. అన్సర్‌, ఎంఎ.ఖాన్‌, ఎంఎ.సయ్యద్‌, సయ్యద్‌ అలీ, ఎండి జిలానీ, అన్వర్‌, ఎండి.బషీర్‌, గౌస్‌ మొహిద్దీన్‌, షేక్‌ కసుమూర్‌, మోయిన్‌ ఖాన్‌, ఇమాం సాహెబ్‌ పాల్గొన్నారు. పెద్దాపురం గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర పలు గ్రామాల మీదుగా తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పేకేటి వెంకటేశ్వరరావు, మేడిది శ్రీనివాస్‌, మొయిళ్ల కృష్ణమూర్తి, బొరుసు రాజు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పార్టీశ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. స్టేషన్‌ సెంటర్‌ రింగ్‌ సెంటర్‌ వద్ద అడబాల కుమారస్వామి, బడుగుశ్రీకాంత్‌ ఆధ్వర్యంలో చేపనట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో నవీన్‌ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంటే జగదీష్‌ మోహన్‌, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్‌, బలుసు వాసు, అందుగుల జార్జి చక్రవర్తి, తాతపూడి కృష్ణబాబు పాల్గొన్నారు.