ప్రజాశక్తి - ఆదోని
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని సాదాపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సంతకాల సేకరణ చేస్తూ టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ పోస్టు కార్డు ఉద్యమం ఉధృతం చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో వస్తే ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం ప్రవేశపెట్టి ఆడ బిడ్డకు అన్యాయం జరిగితే అర సెకండ్‌లో దిశా చట్టం వస్తుందని ప్రగల్భాలు పలికారని, భవ్యశ్రీ మృతి చెంది రోజులు గడుస్తున్నా దిశా చట్టం రాలేదు ఎందుకని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపిపి మురళీ, సాధిక్ వలీ, రాజశేఖర్, లోకేష్, రాజేశ్వరి, మండగిరి బాబురావు, నాగేంద్ర, ఢణాపురం నాగిరెడ్డి, వేమన్న, పెద్దతుంబలం శ్రీనివాస్, నరసప్ప, భరత్ కుమార్, వీరేష్, పులికొండ, కోళ్లప్ప, మండగిరి లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
సంతకాల సేకరణ చేపడుతున్న నాయకులు










