Sep 30,2023 20:50

పార్వతీపురంలో హారన్లు మోగిస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

  ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం  : చంద్రబాబునాయుడుకు మద్దతుగా మండలంలో టిడిపి నాయకులు శనివారం రాత్రి మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఎల్విన్‌పేటలో కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని గంటకొట్టి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి కార్యదర్శి పి.శ్రీనివాసరావు, నాయకులు సొంటేన రాజేష్‌, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగూడ లో చంద్రబాబుకు సంఘీభావం... కొత్తగూడలో టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక పద్మావతి ఆధ్వర్యంలో గిరిజనులు చంద్రబాబుకు మద్దతుగా గంట కొట్టి సంఘీభావం తెలిపారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో సెల్‌ ఫోన్‌ వెలుగుల మధ్య కంచాలు పట్టుకుని మోత మోగించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు కొండలరావు, గిరిజనులు పాల్గొన్నారు. పార్వతీపురంరూరల్‌ :టిడిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తం పిలుపు నిచ్చిన మోతమోగిద్దాం కార్యక్రమం విజయవంతమైంది.నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి, బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి అందుబాటులో ఉన్న వాయిద్య పరికరాలు, విజిల్స్‌, పళ్లాలపై గరిటలతో చప్పుడు చేస్తూ ఏకధాటిగా మోత మోగించారు. నియోజకవర్గ ఇన్‌చార్జీ బోనెల విజయచంద్ర పట్టణంలో పాతబస్టాండ్‌ కూడలిలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, సీనియర్‌ నాయకులు బార్నాల సీతారాంతో కలిసి డప్పులు వాయించారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మండలంలోని కృష్ణపల్లిలోని ఎన్టీఆర్‌ కూడలిల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డిశ్రీదేవితో కలిసి తమ ఇంటి ప్రాంగణంలో పల్లేలను వాయించి సందడి చేశారు. వీరఘట్టం: చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావంగా శనివారం రాత్రి వీరఘట్టం, ఎం.రాజపురంలో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జిని నిమ్మక జయకష్ణ , మండల అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు జామి లక్ష్మీనారాయణ, సింహాచలం, మాచర్ల అనిల్‌కుమార్‌, బల్ల హరిబాబు, పారిచర్ల వెంకటరమణ, డి శ్రీనివాసరావు, పి.మహేష్‌, ఎన్‌.శశికుమార్‌, జి.గౌర్నాయుడు, ఆర్‌ తాతబాబుతో పాటు జనసేన నాయకులు కె.పవన్‌సాయి, కోడి వెంకటరమణ నాయుడు, ఎం.పుండరీకం, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాలూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కి నిరసనగా శనివారం సాయంత్రం 7గంటలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పల్లాలు, బిందెల పై వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ ఆధ్వర్యాన పట్టణ నాయకులు కార్యకర్తలు మోత మోగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన సాగిస్తోందని, టిడిపి నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్లమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే మండలంలోని మామిడిపల్లిలో టిడిపి మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షులు ఆముడాల పరమేష్‌,బుస తవుడు, తాడు తురి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.