Sep 12,2023 20:21

ఈరన్న మృతదేహాన్ని సందర్శిస్తున్న బీవీ

ప్రజాశక్తి - గోనెగండ్ల
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వార్త విని మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన ఆరెకంటి ఈరన్న మృతి చెందారు. ఈరన్న టిడిపి బూత్‌ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో కర్నూలులోని అమీలియో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా చంద్రబాబు అరెస్టు వార్తను తన సెల్‌ ఫోన్‌లో చూస్తూ ఉద్వేగంతో గుండె నొప్పికి గురయ్యారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందారు. మంగళవారం అల్వాల గ్రామంలోని మృతుని నివాసానికి మాజీ ఎమ్మెల్యే బీవీ.జయ నాగేశ్వరరెడ్డి చేరుకొని ఈరన్న మృతదేహాన్ని సందర్శించి మృతదేహంపై టిడిపి జెండా కప్పి నివాళులర్పించారు. టిడిపి నాయకులు అల్వాల సర్పంచి బాష, నజీర్‌ సాహెబ్‌, బేతాళ బడే సాబ్‌, తిరుపతయ్య నాయుడు, రమేష్‌ నాయుడు, లడ్డు బాష, డ్రైవర్‌ నరసన్న పాల్గొన్నారు.