ప్రజాశక్తి - చీరాల
చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని టిడిపి ఇంచార్జి ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం స్థానిక కొత్తపేట టిడిపి కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు 7వ రోజు కొనసాగాయి. దీక్షలో ఈపురుపాలెం టిడిపి నాయకులు అందె ఉమామహేశ్వరరావు, అవ్వారు సాంబయ్య, సయ్యద్ ముతహర్, పొట్టేటి పాండురంగారావు, ఆకురాతి ఏడుకొండలు, నందం లావణ్య, కౌతరపు నాగేశ్వరి, కర్నేటి రవి, విన్నకోట జగదీష్, సంబారు రాఘవ, కొప్పు రంగారావు, శీలం దేవరాజ్ పాల్గొన్నారు.










