ప్రజాశక్తి - చిప్పగిరి
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఆలూరు ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు పాదయాత్ర నిర్వహించారు. బుధవారం చిప్పగిరి మండల కన్వీనర్ లాయర్ షేక్షావలీ ఆధ్వర్యంలో చిప్పగిరి బంబం స్వామి దర్గా నుంచి గ్రామంలోని భోగేశ్వర దేవాలయం వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాదయాత్ర చేపట్టారు. అనంతరం స్థానిక బస్టాండ్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి కన్వీనర్ లాయర్ షేక్షావలీ, మాజీ జడ్‌పిటిసి మీనాక్షి నాయుడు మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును న్యాయంగా ఎదుర్కోలేక అక్రమ అరెస్టు చేయించి వేధిస్తున్నారని తెలిపారు. చంద్రబాబును మానసికంగా దెబ్బ కొట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఈ తతంగమంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కోర్టు ద్వారా క్లీన్ చీట్ తీసుకొని బయటకు వస్తారన్నారు. టిడిపి సీనియర్ నాయకులు రఘు ప్రసాద్ రెడ్డి, బంటనహాల్ సర్పంచి సుశీలమ్మ, ఎంపిటిసి రజిని, మాజీ వైస్ ఎంపిపి వెంకటేశులు, టిడిపి మాజీ కన్వీనర్ కిష్టప్ప, పులికొండ, భాస్కర్, తిమ్మయ్య, జనార్ధన స్వామి, అంపయ్య, నరసింహులు, సురేష్, సతీష్, మేకల రామాంజిని, హరినాథ్, ఉమాపతి, నాగిరెడ్డి, అమరేష్ పాల్గొన్నారు.
చిప్పగిరి పాదయాత్రలో పాల్గొన్న టిడిపి నాయకులు










