Nov 27,2022 23:50

నుజ్జయిన బస్‌ ఇదే..

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలో డిఎల్‌ పురం, నెల్లిపూడిలో, గునిపూడి గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వామి దీక్షాపరులు బస్సు ప్రమాదంలో గాయాలతో బయట పడ్డారు. ఈ గ్రామాలకు చెందిన చెందిన అయ్యప్పస్వామి దీక్షాపరులు శనివారం ఒక ప్రైవేటు ట్రావెల్‌లో శబరిమలై వెళ్తుండగా వీరి ప్రయాణిస్తున్న బస్సు ఒంగోలు వద్ద ప్రమాదానికి గురైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అయ్యప్ప దీక్షాపరులు ప్రయాణిస్తున్న బస్సు ఒంగోలు వైద్య కళాశాల సమీపాన లారీని ఢకొీట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ బస్సులో 44 మంది అయ్యప్ప స్వామి దీక్షాపరులు ఉండగా వారిలో సుమారు 20 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరిలో నలుగురికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయని అక్కడ చికిత్స పొందుతున్న డీఎల్‌ పురం గ్రామానికి చెందిన అయ్యప్ప దీక్షాపరులు స్థానిక విలేకరులకు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు ఒంగోలు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. గాయపడిన వారిలో జి కనకారావు, జి.నానాజీ, కే.శ్రీను, ఎ.అప్పలరాజు, జి శ్రీను, జి.గోవిందు ,జి.మంగ, జి.వెంకటలక్ష్మి, కాంతం, ఏ.నాగరత్నం, అనసూయ డి.హరి, కె.అప్పలకొండ జి సత్యనారాయణ, కే.గణేష్‌, డి.నరేష్‌ ఉన్నారు. ఎవరికీ ప్రాణహాని లేక పోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.