ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ : మాజీ అయ్యన్న వంటి వారితోనే తెలుగుదేశం పార్టీకి ముప్పు వాటిల్లుతుందని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, టిడిపి నేత ఈర్లె శ్రీరామూర్తి తెలిపారు. స్థానిక కృష్ణా ప్యాలెస్‌లో బుధవారం విలేకరు సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామమూర్తి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు హయాం నుండి తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు తాను అందించానని, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కారణంగా తన వంటి వారికి గుర్తింపు లేకుండా పోతుందన్నారు. పార్టీ నాయకులు అచ్చం నాయుడు, చంద్రబాబు తనను గుర్తించినప్పటికీ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి వారిని అయ్యన్న పక్కతోవ పట్టించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఏపీ జేఏసీ అమరావతి పూర్వపు ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేక పదవులు చేశానని గుర్తు చేశారు.తాను గంటా శ్రీనువాస్‌తో తిరుగుతున్నాననే నెపం వేసి ఎమ్మెల్సీ అవకాశాన్ని అయ్యన్న తప్పించారని ఆవేదన చెందారు. ఇలాంటి వారితో పార్టీకి ఎంతో చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. బిసి నాయకుడిగా చెప్పుకునే అయ్యన్న వెలమ నేతనైన తనకు ద్రోహం తలపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ సమావేశంలో రిటైర్డ్ విఆర్‌ఓ టీ చినబాబు, మాజీ గ్రామ రెవెన్యూ సంఘ నాయకులు త్రినాధరావు, పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు కే.దేవుడు పాల్గొన్నారు
అధిష్టానాన్ని పక్కదోవ
ప్రజాశక్తి-రోలుగుంట: ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈర్లె శ్రీరామ్మూర్తి బుధవారం రోలుగుంటలో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీ అధిష్టానాన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సీనియర్‌గా పార్టీలో పని చేస్తున్న తన వంటి సీనియర్ నాయకులకు అన్యాయం చేయడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేసిన తనకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సమాచార హక్కు కమిషనర్ పదవికి చంద్రబాబు సిఫార్సు చేశారని, ప్రతిపక్ష నాయకుడు జగన్ మద్దతు ఇచ్చారని చివరి క్షణంలో అయ్యన్న చక్రం తిప్పి తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పార్టీ తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు సీటు ఇవ్వాలని అధిష్టానం మొగ్గు చూపిందని, అయ్యన్నపాత్రుడు తనకు సీటు రానివ్వయకుండా మరొకసారి అడ్డుపడ్డారని విమర్శించారు.










