ప్రజాశక్తి-నర్సీపట్నం రూరల్:మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును గురువారం ధమాకా సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాధరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అనకాపల్లికి చెందిన త్రినాధరావు సినీ రంగంలో డైరెక్టర్గా రాణించడం సంతోషంగా ఉందన్నారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన పూరీ జగన్నాధ్, గుణశేఖర్, పరశురాం వంటి వారు ఇప్పటికే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నక్కిన త్రినాధరావు గుర్తిండిపోయేలా సినిమాలు తీశారన్నారు. రాజ్ తరుణ్ హీరోగా సినిమా చాపిస్తా మామా, నాని హీరోగా నేను లోకల్ వంటి చిత్రాలు అందించారని, తాజాగా రవితేజ హీరోగా ధమాకా చిత్రానికి దర్శకత్వం వ హించి మంచి విజయాన్ని దక్కించుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని చిత్రాలు తీసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.దమాకా చిత్ర భారీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో మైత్రి మూవీస్, దిల్ రాజు బ్యానర్లలో సినిమాలను తీస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తనయుడు చింతకాయలు రాజేష్, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీ నర్ మల్ల సురేంద్ర, నక్కిన సురేష్, పీలా జగన్నాధరావు, మావూరి వెంకటేష్, సూర్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.










