Aug 13,2023 00:18

విన్యాసాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - కె.కోటపాడు : స్థానిక అయ్యన్న విద్యా సంస్థల్లో ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముందస్తుగా శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల ఆట మైదానంలో విద్యార్థులు త్రివర్ట పతాకాలతో సందడి చేశారు. విద్యార్థుల ప్రదర్శించిన వివిధ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మువ్వన్నెల పొడవాటి పతాకం, 76వ సంఖ్య అకారంలో విద్యార్థులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ముక్తకంఠంతో పలికిన భారత్‌ మాతాకీ జై, మేరా భారత్‌ మహాన్‌, జైబోలో భారత్‌ మాతాకీ, వందేమాతరం నినాదాలు మిన్నంటాయి. విద్యా సంస్థల అధినేత డాక్టరు ఖాశీం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా చెప్పారు.