అయ్యన్నతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు .
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్ : ఇటీవల సిఐడి పోలీసులు అరెస్టు చేయడంతో బెయిల్‌పై వచ్చిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును ఆదివారం నర్సీపట్నంలోని ఆయన నివాసంలో మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గణపతిరాజు పరామర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ అధ్వానంగా తయారయ్యా యన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రశ్నించే గొంతుకు కళ్లెం వేయాలని చూడటం సరికాదన్నారు. అయ్యన్నను పరామర్శించిన వారిలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ఉన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుమారు 150 కార్లలో భారీ ర్యాలీగా అయ్యన్నను పరామర్శించడానికి తరలి వచ్చారు.










