మాట్లాడుతున్న అయ్యన్న
ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి బుధవారం నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును కలిసి సంఘీభావం తెలిపి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మంచి నాయకుడిగా అయ్యన్న పేరు తెచ్చుకున్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందార న్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపిగా పని చేసి చేశారన్నారు. జగన్మోహన్‌రెడ్డిని ఎవరైనా విమర్శించినా, ప్రశ్నించినా తట్టుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఒక్క చాన్సు అంటూ అధికారంలోకి వచ్చి రాజధానులను మార్చడానికి చూస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో భూము లను కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు.










