Nov 13,2022 00:01

అయ్యన్నను కలిసిన నాయకులు

ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్‌:మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడును శనివారం రంపచోడవరం టీడీపీ ఇన్చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే, అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు శివాజీ రాజు నర్సీపట్నంలో పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మాగాపు బాబురావు, రంప చోడవరం మండల అధ్యక్షులు కారం సురేష్‌బాబు, గంగవరం మండల అధ్యక్షులు పాము అర్జున్‌, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గోళ్ళ చంటిబాబు, అరకు పార్లమెంట్‌ బిసి సెల్‌ కార్యదర్శి ముచ్చు నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు లంక హరిబాబు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వై.నిరంజనదేవి, దేవీపట్నం ప్రధాన కార్యదర్శి ఎట్టా మెహర్బాబాగౌడ్‌, గంగవరం మండల ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్‌, సింహాద్రి రాంబాబు, జడ్పిటిసి మాకాడ బుల్లమ్మ, దేవీపట్నం సర్పంచ్‌ కుంజం రాజమణి, సర్పంచ్‌ వంతల అచ్చియమ్మ, ముప్పన సావిత్రి, కారం పోచమ్మ, కొండపల్లి వెంకటలక్ష్మి, గంగిరెడ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కూడా సంఘీభావం తెలిపి అయ్యన్నకు మద్దతు తెలిపారు. ఆయనతో పాటు వాసే మురళి, గోకవరపు సునీల్‌ రెడ్డి, అప్పారావు, బూరడ మధు, ఆర్నే పల్లి పాండురెడ్డి, షణ్ముక్‌ శొంఠి, రామకృష్ణ, పొలాసి ఉమా, నిమ్మగడ్డ కృష్ణారావు, గండికోట గోపి, వంగపండు ఆదినారాయణ, గోవాడ శివ, నున్నా పృద్వి, సూరపనేని వంశీ, దొండపాటి మహేష్‌, ఈగ బాజి పాల్గొన్నారు.