Sep 02,2023 00:35

మాట్లాడుతున్న అయ్యన్న

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును అరెస్టు చేయడంతో నర్సీపట్నంలో ఆయన ఇంటి వద్ద అభిమానులు కోలాహలం ఏర్పడింది. గతంలో ఆయన తనయుడు రాజేష్‌, విజరు, అయ్యన్న పాత్రులను ఇప్పటికే పలుమార్లు అరెస్టు చేయడం విడిచిపెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం అయ్యన్నను తాళ్లపాలెం సమీపంలో అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేశారని అయ్యన్న తెలిపారు. ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని విమర్శించినందుకు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయ్యన్న మాట్లాడుతూ, ఈనెల 4న తన పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎన్టీఆర్‌ ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.ప్రతిపక్ష నాయకుల పై కక్ష తీర్చుకునే తీరు మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని, తప్పులను ఎత్తిచూపటమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం అని అయ్యన్న తెలిపారు.
అయ్యన్నపై అక్రమ కేసులు అమానుషం
అనకాపల్లి : మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడును ప్రతిసారి వైసీపీ ప్రభుత్వం కుంటు సాకులతో అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా పోలీసులు 41ఏ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అరెస్టు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇది అమానుషమన్నారు. సమావేశంలో కడిమిశెట్టి నరసింహారావు, కోట్ని రామకృష్ణ, బోడి వెంకటరావు, బర్నికాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయడం వైసిపి నిరంకుశ పాలనకు పరాకాష్ట అని టిడిపి మాడుగుల నియోజకవర్గ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయ్యన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.