ప్రజాశక్తి-యంత్రాంగం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఎక్కడికక్కడ ఆ పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు.
ఆనందపురం : అయ్యన్నపాత్రుడు అరెస్టుపై విశాఖపట్నం సిఐడి ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతున్న విశాఖపట్నం పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ను, విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పాశర్ల ప్రసాద్‌ను అరెస్టు చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఆధ్వర్యాన ఆనందపురం కూడలిలో ధర్నా నిర్వహించారు. ధర్నా చేపట్టిన రాజబాబుతో పాటు, రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు కురిమిన లీలావతి, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి, నాయకులు శెట్టిపల్లి గోపి, బొద్దాపు శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, గురునాథ్, బోడపూడి దొరబాబు, పెంటపల్లి యోగేశ్వరరావు, సంజీవ్ కుమార్, సోడిపల్లి నారాయణరావు, గుండు చిన్నబాబు, కోరాడ వైకుంఠం తదితరులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
కరాస : జివిఎంసి 90వ వార్డు పరిధిలోని జాతీయ రహదారిలో ఎన్‌ఎస్‌టిఎల్ బైపాస్ రోడ్డు వద్ద కార్పొరేటర్ బొమ్మిడి రమణ ఆధ్వర్యాన టిడిపి నాయకులు నిరసన తెలిపారు. అయ్యన్నపాత్రుడు అరెస్టు ముమ్మాటికి కక్ష సాధింపు చర్యఅని రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మందలపు వాసుదేవరావు, మళ్ళ అప్పారావు, పెంటకోట అజరుబాబు, నరవ అనూష, మూర్తి పట్నాయక్, నరవ పైడిరాజు, గొట్టిపాటి సురేష్‌కుమార్‌చౌదరి, వేగినటి శ్రీనివాసరావు, పోతల సతీష్, పొలిశెట్టి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం : పెదగంట్యాడలో టిఎన్‌టియుసి ఆధ్వర్యాన నిరసన తెలిపారు. అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు అక్రమ అరెస్టులను ఖండించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు పైడిరాజు, పాండ్రంగి జయరాజునాయుడు, కరణం సత్యారావు, దేవుపల్లి సీతారాం, మొల్లి ప్రకాష్, బొడ్డు రమణ, బొడ్డు రాజేష్, జై జాన్, మామిడి అప్పారావు పాల్గొన్నారు
సిఐడి కార్యాలయం వద్ద ఆందోళన
ఆరిలోవ : మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు అక్రమ అరెస్టుతో ఆ పార్టీ నాయకులు గురువారం ఉదయం పైనాపిల్ కాలనీలోని సిఐడి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ప్రణవ్ గోపాల్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టుచేసి ఆనందపురం స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా పెదగదిలి కూడలి వద్ద 9, 10, 11, 12, 13 వార్డుల టిడిపి నాయకులు ఆందోళన చేశారు. అయ్యన్న పాత్రుడిని సిఐడి కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఉంచారు. ఆ సమయంలో పోలీసులు ఎవ్వరినీ లోపలకు పంపించలేదు. టిడిపి న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెన్నెల ఈశ్వరరావు, పిఎస్.నాయుడు మాట్లాడుతూ, అయ్యన్న పాత్రుడి అరెస్టు పూర్తిగా కక్షపూరిత చర్య అన్నారు.










