ఫొటో : వెంకటరమణయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిబ్బంది
అయ్యంకి వెంకటరమణయ్య జయంతి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి వేడుకలను సోమవారం పట్టణంలోని గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఇన్‌ఛార్జి శ్రీనివాసరాజు మాట్లాడుతూ అయ్యంకి వెంకటరమణయ్య తూర్పుగోదావరి జిల్లా కొరికుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించారని తెలిపారు. రాష్ట్రమంతటా పర్యటించి పెద్ద గ్రంథాలయాలు ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సిబ్బంది పాఠకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రికార్డ్ అసిస్టెంట్ ఎల్.తనూజ, తదితరులు పాల్గొన్నారు.










