అయ్యా గుక్కెడు నీళ్లు ఇవ్వండి...!
'గడప గడపకు మన ప్రభుత్వం'లో సమస్యల వెల్లువ
ప్రజాశక్తి - బాలాయపల్లి: 'అయ్యా గుక్కెడు నీళ్లు ఇచ్చి ఆదు కోండి..' అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కు మండలంలోని మన్నూరు గ్రామంకు శుక్రవారం వచ్చిన తిరుపతి జిల్లా వైసిపి అధ్య క్షుడు, వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా మన్నూరు మిట్ట, కొత్తూరు గ్రామ ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నామని ఆయన దష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా చినుకు పడితే బురద బురదగా వీధులు తయార వుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్ కి ఇప్పుడు గుర్తుకొచ్చిందా?
'మన్నూరు మిట్ట గ్రామంలో రాత్రి అయితే వీధిలైట్లు వెలగవు.. విష పురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయి.. ఇక బోరు మరమ్మతులకు గురై మూడు ఏడాదిలైంది. గ్రామ సర్పంచ్ కి ఇన్ని రోజులకి మా గ్రామం ఉందని గుర్తుకొచ్చిందయ్యా ?' అంటూ నేదురుమల్లి దష్టికి తీసుకువచ్చారు.
సమస్యల పరిష్కారానికి హామీ
'నేను ఉండగా మీ సమస్యలు తీర్చేందుకు అందుబాటులో ఉంటా..' అని నేదురు మల్లి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైసిపి ప్రచార కమిటీ అధ్యక్షుడు నెమలపూడి సురేష్ రెడ్డి, ఎంపీపీ సింగంశెట్టి భాస్కరరావు, వెంకటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ సింగంశెట్టి భాస్కరరావు, జయంపు సహకార సంఘం అధ్యక్షుడు వెందోటి కార్తిక్ రెడ్డి, వైసిపి నాయకురాలు కాటూరు తులసి రెడ్డి, మాజీ ఒక ఎంపీపీ రాయి రమేష్ చౌదరి, వైసిపి నాయకుడు చెన్నూరు. మస్తాన్ రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










