
ప్రజాశక్తి - పంగులూరు
ప్రాచీన ఆయుర్వేద వైద్యం ఉపయోగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఔషధ మొక్కల పెంపకాన్ని అందరూ ప్రోత్సహించాలని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కృష్ణ కుమార్ అన్నారు. 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ ఉత్తర్వులు మేరకు ధన్వంతరి జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. మన పరిసరాల్లో పెరుగుతున్న అనేక మొక్కలను గురించి మనకు తెలియదని అన్నారు. ఆ మొక్కల యొక్క ఉపయోగాలను తెలుసుకుంటే వాటి ద్వారా మనం ఎంతో ఆరోగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉందని అన్నారు. ఔషధ మొక్కలను పెంచడం ద్వారా మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుందని అన్నారు. తక్కువ ఖర్చుతో ఇబ్బంది లేకుండా వైద్యం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కోరారు. స్థానిక ఆయుర్వేద హాస్పటల్ ద్వారా వివిధ రకాల వ్యాధులకు ఉచితంగా ఆయుర్వేద మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆయుర్వేద వైద్యం పట్ల మంచి అవగాహన పెంచుకోవాలని కోరారు. పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ బాలరాజేశ్వరి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.