
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంహెచ్‌ఒ భాస్కరరావు
ప్రజాశక్తి-విజయనగరం : అయోడైజ్డ్ ఉప్పు వినియోగంతో థైరాయిడ్ బారిన పడకుండా దోహద పడుతుందని డిఎంహెచ్‌ఒ ఎస్.భాస్కరరావు అన్నారు. 'గ్లోబల్ అయోడిన్ డెఫిసియన్సీ డిజార్డర్ డే' సందర్బంగా శనివారం వైద్యసిబ్బంది నిర్వహించిన ర్యాలీని డిఎంహెచ్‌ఒ జెండా ఊపి ప్రారంభించారు. అయోడైజ్డ్ ఉప్పు అతి గొప్ప రక్షణ కవచమని, థైరాయిడ్ భారిన పడకుండా ఉండేందుకు దోహద పడుతుందని అన్నారు. మెదడును అభివృద్ధి చేస్తుందని, జీవ క్రియను క్రమబద్దీకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎన్.సూర్య నారాయణ, డాక్టర్ పి.రవికుమార్, ఎన్‌సిడిపిఒ వి.చినతల్లి, మలేరియా నివారణ అధికారి డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.