ప్రజాశక్తి - పోలవరం
మండల అభివృద్ధిలో మండల వైసిపి కన్వీనర్ బుగ్గా మురళికృష్ణ చేసిన సేవలు ఎనలేనివని, అభినందనీయమని జడ్‌పిటిసి కలుం హేమ కుమారి తెలిపారు. బుధవారం పోలవరంలోని మురళి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి పొడుం పుష్ప, ఉప సర్పంచి కోరసిక శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించడంలో కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పట్టిసీమ సొసైటీ ప్రెసిడెంట్ రాజబాబు, లంకా సూర్య అప్పాజీ, షేక్ షహేన్షా భాషా, సొబ్బన మోహన్, ఘంటా శ్రీను, అక్కాబత్తుల రాజు, గోకారాజు, సాయి పాల్గొన్నారు.










