Dec 20,2022 22:22

గోద్రేజ్‌ సమాధాన్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలు
కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి - చాట్రాయి

రాష్ట్రంలో అత్యధికంగా ఆయిల్‌పామ్‌ సాగు మన జిల్లాలోనే సాగవుతుందని, అలాగే దేశంలోనే అత్యధిక సాగు మన రాష్ట్రంలోనే ఉందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. మంగళవారం చాట్రాయిలో గోద్రేజ్‌ వారి అగ్రోవిట్‌ సమాధాన్‌ ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కేంద్రాన్ని ఆయన గోద్రేజ్‌ సిఇఒ సౌగత నియోగితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయిల్‌పామ్‌ రైతులతో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఆయిల్‌పామ్‌ ఉత్పత్తి మన రాష్ట్రంలో 2.43 లక్షల హెక్టార్లలో సాగవుతుందని తెలిపారు. దీనిలో ఏలూరు జిల్లాలో 22 మండలాల్లో 48 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ తోటలు ఉన్నాయన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో 4,500 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటలు పెంచడానికి ప్రణాళిక రూపొందిస్తు న్నారన్నారు. ఆయిల్‌పామ్‌ పంటకు నీరు ముఖ్యమని, దీనికి డ్రిప్‌ ఇరిగేషన్‌ వినియో గించి మొక్క మొదళ్లలో ఫెర్టిలైజెర్స్‌ను చల్లితే ఉత్పత్తి ఎక్కువగా వస్తోందన్నారు. గోద్రేజ్‌ కంపెనీ వారు ఆయిల్‌పామ్‌ రైతులకు చేరువగా అవసరమైన పురుగుమందులు, ఎరువులు, డ్రిప్‌ పరికరాలు, వేబ్రిడ్జి, నాలెడ్జి షేరింగ్‌ సెంటర్‌ క్యాంపు ఏర్పాటు చేసి కమర్షి యల్‌గా కాకుండా సేవలు అందించడానికి ముందుకొచ్చి గోద్రేజ్‌ సమాధాన్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని కలెక్టర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజేంద్రన్‌, గోద్రేజ్‌ సిఇఒ సౌగత నియోగి, ఎపి కోఆపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌ రాఘవరెడ్డి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రవికుమార్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి పాండురంగ, ఐఐఒ పిఆర్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ ఎంవి.ప్రసాద్‌ మాటా ్లడారు. గోద్రేజ్‌ కంపెనీ వారు సమకూర్చిన ఐదు ఆయిల్‌పామ్‌ రైతుల కుటుంబాల్లో పదో తరగతిలో మెరిట్‌ సాధించిన పిల్లలకు, 10 మంది ఆదర్శ రైతులకు కలెక్టర్‌ బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా జూనియర్‌ రైతులకు ఉపయోగపడే డైరీని కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం కేంద్రం ప్రాంగణంలో కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఉష, ఎంపిటిసి ఎస్‌ఎస్‌.శివకుమారి, గోద్రేజ్‌ సమాధాన్‌ కేంద్రం సిబ్బంది, ఆయిల్‌పామ్‌ రైతులు పాల్గొన్నారు.