Aug 03,2023 21:46

రైతులకు పామాయిల్‌ మొక్కలు అందజేస్తున్న ఉద్యానశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి

ప్రజాశక్తి - సీతానగరం :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయిల్‌ పామ్‌ రైతులకు మెరుగైన సేవలు అందించడం వల్ల అధిక దిగుబడులు సాధించి లాభాలు సాధించవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖాధికారి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. మండలంలోని బగ్గం దొరవలసలో గల శ్రీనివాసా పామాయిల్‌ నర్సరీ వద్ద గురువారం నిర్వహించిన మెగా పామాయిల్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దఎత్తున మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పామాయిల్‌ రైతుల సమావేశంలో పామాయిల్‌ ప్లాంటేషన్‌ గూర్చి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మెగా ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమం గూర్చి వివరించారు. గురువారం అన్ని ప్రాంతాల్లో పామాయిల్‌ ప్లాంటేషన్‌ పెంప కానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్ర మాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టెక్నికల్‌ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ క్రాంతి,మండల హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ప్రత్యూష, కంపెనీ ఎండి పి.పాండురంగారావు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ పి.మణిదీప్‌కృష్ణ, ప్లాంటేషన్‌ మేనేజర్‌ జి.వీరబాబు, ప్లాంటేషన్‌ నర్సరీ ఇంచార్జి కె.శ్రీనివాసరావు, ప్రజాప్రతి నిధులు తిరుపతినాయుడు, నారాయణరావు, కర్రి శ్రీరాములు, రెడ్డి గోపీనాథ్‌, కర్రి శంకరరావు పామాయిల్‌ రైతులు కొట్యాడ శంకరరావు, దామినేని సతీష్‌ తదితర రైతులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.