Jan 10,2022 07:30

న్యూఢిల్లీ: :అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినందున ఈ రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ బొమ్మను తొలగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. . ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాల్సి ఉందని ఈ వర్గాలు వెల్లడించాయి. యుపి, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మరు క్షణం నుంచే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇదే విధమైన చర్యలు తీసుకుంది.