ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: సరైన యాజమాన్యంతో మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చని మండల ఉద్యానశాఖాదికారి శివకుమారి మామిడి పంటలను సిబ్బంది పూర్ణిమతో కలిసి పరిశీలించారు. ఆమె మామిడి రైతులకు సూచనలిస్తూ... ప్రస్తుతం మామిడి సీజన్ మొదలైంది. మామిడిలో అక్కడక్కడ కొంత మేరకు పూత వచ్చింది, ఇంకా కొన్నిచోట్లలో పూత రాలేదు,తోటల్లో పూత అంతా ఒకేసారి మరియు పూత మొత్తం రావడానికి ఒక లీటరు నీటికి 10 గ్రాముల మల్టీకే (13:00:45) లేదా మోనో పోటాషియం ఫాస్ఫేట్ (00:52:34)మరియు1గ్రాము బోరాను కలిపి పిచికారి చేయాలి.పూత నుండి కాయ కోసే వరకు రకరకాలైనటువంటి చీడపీడలు ఆశిస్తాయి. అందులో అతి ముఖ్యమైనది తేనెమంచుపురుగు ఇది ఎక్కువగా ఆశిస్తుంది.దీని నివారణకు ఇమిడా క్లోప్రిడ్ 0.4మి.లీ లేదా పురుగు ఉధృతి కొనసాగితే 15 నుండి 20 రోజుల తర్వాత థయోమితాక్సిమ్ -0.3 గ్రాములు లేదా ఇంకా నష్టం కొనసాగితే బుఫ్రో ఫెజిన్-1 నుండి 2మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆంత్రక్నోస్ మచ్చ తెగులు కూడా ఆశిస్తుంది ఇందుకు ఎండిన కొమ్మలను ఆకులను తొలగించి పండ్ల తోటలను శుభ్రంగాఉంచుకోవాలి .కొమ్మలు కత్తిరింపు వలన తెగుళ్ల ఉధృతిని తగ్గించుకోవచ్చు.దీని నివారణకు మాంకోజబ్-2 గ్రాములు లేదా కార్బండజిన్-1 గ్రాము లేదా సాఫ్ రెండు గ్రాములు లేదా అజాక్సీ స్ట్రోబిన్ 1మి.లీ లేదా మెరివోన్ 0.3మిల్లిలు ఒక లీటర్ నీటికి పుష్పించే సమయంలో 15 రోజుల విరామంతో పిచికారి చేయటం వలన మచ్చ తెగులును నియంత్రించవచ్చు అలాగే కాయలపై వచ్చు మచ్చ తెగులు నివారించడానికి బఠానీ గింజంత కాయలు ఏర్పడినదశలో రెండు సార్లు పిచికారి చేయాల్సివుంటుంది.










