ప్రజాశక్తి-యర్రావారిపాలెం : పంట సాగులో అవసరానికి మించి ఎరువులు మరియు రసాయనిక మందులు వాడటం అంత మంచిది కాదని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఏ డి ఏ భాస్కరయ్య తెలిపారు.ఆత్మ పథకం కింద మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతుల శిక్షణ కార్యక్రమంలో ఏడిఏ భాస్కరయ్య మాట్లాడుతూ వరి పంటలో అధికంగా వాడేటువంటి రసానిక ఎరువులు యూరియా అధికంగా వాడటం వలన చీడపీడులు అధికంగా ఆశించే ప్రమాదం ఉందని తెలిపారు.!అలాగే ప్రస్తుతం మామిడిలో పూత ముందస్తుగా వస్తున్నది కాబట్టి పూత,మొగ్గ దశలో ఉన్నప్పుడే శాస్త్రవేత్తలు సూచించిన మందులును మాత్రమే నీటిలో పిచికారి చేసి వాడటం వల్ల తేనె మంచు, బూడిద తెగులు, నివారించవచ్చని తెలిపారు. రబీ సాగులో సాగు చేసే పంటలన్నిటికీ ఈ క్రాఫ్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఖాదర్ భాష తెలిపారు. మామిడి తోటలతో పాటు నేరేడు, డ్రాగన్ ఫుడ్ పంట తోటలను పరిశీలించి రైతులకు సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలోఆర్.బి.కె సిబ్బంది భాను ప్రకాష్, జాహ్నవి,రాజశేఖర్, మునిశేఖర్, ఇలియాజ్,సాయి కృష్ణ, నలిని, తదితరులు పాల్గొన్నారు.










