Feb 08,2023 15:51

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రక్తదానంపై అపోహలు వద్దని స్థానిక ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, అల్లూరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గంగరాజు అన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక వెలుగు కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు,ఈ  శిబిరాన్ని స్థానిక ఎంపీపీ గోము వెంకటలక్ష్మి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి గోము వెంకటలక్ష్మి,ఎంపిడిఓ కె బాపన్నదొర,తహాశీల్దార సుబ్రహ్మణ్యఆచారి తదితరులు మాట్లాడుతూ,రక్తదానం చేయడం మంచిదేనని దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. అత్యవసర  సమయములో అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. మన్యంలో ఎంతో మంది గర్భిణీలు, బాలింతలు, గిరిజన  బాలికలు మృత్యువాత పడుతున్న నేపద్యంలో వారికి సహృదయముతో  దాతులు ఇచ్చే రక్తం వలన ప్రాణాలు నిలబెట్టేందుకు దోహదపడుతుందన్నారు. ప్రమాదాల భారిన పడిన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వారు కోరారు, వాహనదారులు మోటారు బైకులపై ప్రయాణించేటప్పుడు పరిమిత వేగంతో వెళ్లాలన్నారు. నిత్యం రక్తం అవసరం ఉండి ఎంతోమంది ఇబ్బందులకు గురౌతున్నారని, తలసేమియా, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారన్నారని తెలిపారు. రక్తదానం  చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో వైసిపి జిల్లా నాయకులు దాట్ల వెంకటేశ రాజు, రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రి వైధ్యాధికారి లిఖిత, ఎంఈవో కెతా తబ్బాయి దోర, వెలుగు ఎపియం అధినారాయణ, ఉపాధి హామీ ఎపివో సురేష్, పంచాయతీ  కార్యదర్శలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.