- అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాషా.
ప్రజాశక్తి - ఆలమూరు : నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చి దిద్దడమే లక్ష్యమని అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాషా, ఎస్ఈబి అసిస్టెంట్ సూపర్డెంట్ ఎం.శ్రీనివాసరావు అన్నారు. సబ్ డివిజన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆలమూరు పరిధిలో ఎస్ఐ పి.రాంబాబు సమక్షంలో వారు నాటు సారా తయారీ, అమ్మకం దారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి ఏర్పాట్లపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ డివిజన్ పరిధిలో ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట మండలాలు ఉన్నాయన్నారు. ఇందులో కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని సారా రహిత గ్రామాలుగా తీర్చు దిద్దుతున్నట్లు వారు తెలిపారు. సారా తయారీ, అమ్మకం జరిపిన వారంతా చట్టారీత్యా శిక్షార్హులవుతారని వారు హెచ్చరించారు. ఎవరు సాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అధికారులు రాజు, వెంకటేష్, నాగేశ్వరరావు, వివిధ గ్రామాల వారు పాల్గొన్నారు.










