ప్రజాశక్తి-నాయుడుపేట : యువకులలో మితిమీరుతున్న మాదక ద్రవ్యాల వాడకాల వలన జరిగే నష్టాలను తెలియజేస్తూ ఆదివారం ఉదయం సెబ్ సీఐ ఆర్ యూ వి ఎస్ ప్రసాద్ అధ్యక్షతన నాయుడుపేట సీవీ రామన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు అధికారులు పాల్గొని వీటి వాడకాల వల్ల కలిగే దుష్పలితాలను విద్యార్థులకు వివరించారు. యువత వీలైనంతవరకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని లేకుంటే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. వీటికి అలవాటు పడ్డ వారు ఈ అలవాట్లను నెమ్మదిగా కౌన్సిలింగ్ పద్దతిలో దూరం చేసుకోవాలని చూసించారు. అనంతరం కాలేజీ పిల్లలతో సీవీ రామన్ డిగ్రీ కాలేజీ నుంచి తుమ్మూరు గుర్రప్ప శెట్టి జూ"కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మునిసిపల్ కమిషినర్ వి. నివాసరావు, సెబ్ ఏఎస్పీకె. జానకిరామ్, కాలేజీ ప్రిన్సిపల్ గాదిరెడ్డి. విజయగోపాల్, సెబ్ సిబ్బంది పాల్గొన్నారు.










