
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : బాల్య వివాహాలు నిర్ములనకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాయని వాటికి అనుగుణంగా ప్రతిఒక్కరూ పని చేయాలనీ ఆచంట మండల సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం బాల్య వివాహల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారామ్ మాట్లాడుతూ 18సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే అమ్మాయిలకు పెళ్ళి చేయాలనీ కోరారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహల నిర్ములనపై ప్రజలాంతా అవగాహనా కల్గి ఉండాలని కోరారు. అనంతరం బాల్య వివాహల నిర్ములన పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి గోవర్ధన్, ఎం ఎల్ హెచ్ పి లు రూప, రాశి ఏఎన్ఎంలు డి. పుష్పరాజ్యం, వెంకటరమణ మహిళా పోలీసులు, ఆశాకార్యకర్తలు అంగన్ వాడి సిబ్బంది, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గున్నారు.వ