Jan 30,2023 14:51

ప్రజాశక్తి-పిచ్చాటూరు: సోమవారం ఉదయం  పిచ్చాటూరు మండలములోని వెంగళత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమంను ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పిచ్చాటూరు వైద్యాధికారి డాక్టర్ బి.గాయత్రి  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు కుష్టు వ్యాధి లక్షణాలు గురించి తెలియపరచి కుష్టు వ్యాధి లక్షణములు చర్మంపై స్పర్శ లేని మచ్చలు మందమైనా మెరిసే జిడ్డు గల చర్మం, బత్తాయి తొక్క లాగా ఉండడం చెవులపై వీపుపై ఎదపై నొప్పిలేని బుడిపెలు కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం కనురెప్పలు మూతపడకపోవడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు లేక జోములు కలిగి ఉండడం అరచేతులు అరికాళ్ళలో స్పర్శ కోల్పోవడం చేతి వేళ్ళు కాలివేలు వంకర తిరిగి అంగవైకల్యం రావడంపై అనుమానిత లక్షణాలు ఉన్న ఎడల మీ ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయడానికి వచ్చినప్పుడు చూపించు కొనండి అని తెలియజేసినాము. పురవీధులలో స్లొగన్స్ చెబుతూ ర్యాలీ నిర్వహించితిమి కుష్టు వ్యాధితో పోరాడుదాం కుష్టు వ్యాధిని చరిత్రగా చేద్దాం కుష్టు వ్యాధి వంశపారంపర్యం కాదు. బహుళ ఔషధ చికిత్సతో కుష్టు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం కుష్టురహిత సమాజాన్ని నిర్మిద్దాం కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదు. కుష్టు వ్యాధి అంటే ఎందుకు చింత బహుళ ఔషధ చికిత్స ఉందిగా మన చెంత అని స్లొగన్స్ చెబుతూ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి బి గాయత్రి సామాజిక ఆరోగ్య అధికారి శివయ్య ఆరోగ్య పర్యవేక్షకులు శాంతి నాగరాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, స్కోప్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పార్టీపన్ ప్రోగ్రాం మేనేజర్ గురువారెడ్డి వారి సిబ్బంది  ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్పెర్స్ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు జనవరి 30 వ తారీకు నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజులు మండలంలోని ప్రతి గ్రామంలో జరుగుతుంది అని అన్నారు.