Feb 25,2023 16:02

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ :  కేంద్ర ప్రభుత్వ  సూరజ్ కుండ్ మేళా అథారిటీ  ఆధ్వర్యంలో  పంజాబ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  కేంద్ర పర్యట శాఖ  మంత్రి కిషన్ రెడ్డి, చేతుల మీదుగా చేనేత కార్మికుడు పుత్తూరు పట్టణానికి  చెందిన పుట్ట రాజాకి పరంపర ఘట్ అవార్డును బహుకరించడంతో అరుదైన గౌరవం దక్కింది. గతంలో చేనేత కార్మికుడు పుట్ట రాజా హస్తకళను గుర్తించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దేశనాయకులతో మరెన్నో అవార్డులు దక్కించుకున్నారు. చేనేత కార్మికుడు పుట్ట రాజా మాట్లాడతూ 1994-1995 సం.లో శంకర్ దయాల్ శర్మ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి, ఎంతో గర్వంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాల ఆ సమయంలో కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పరంపర ఘట్ అవార్డు నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని రాజా అన్నారు. ఇప్పటివరకు అతనికి వచ్చిన బహుమతులు అందజేశారు.