May 11,2023 00:17

శ్రీరాములు

ప్రజాశక్తి-తాడేపల్లి : యువకుని అవయవదానం ద్వారా ముగ్గురి జీవితాల్లో వెలుగులు ప్రసరించాడు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు వల్లపు శ్రీరాములు (23) ఇటీవల ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైంది. స్థానికులు, కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ ద్వారా మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. శ్రీరాములు ఆరోగ్య పరిస్థి తిని పరీక్షించిన వైద్యులు అతనికి క్రేనియోథామి శస్త్రచికిత్స నిర్వహించారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరలా వైద్య పరీక్షలు చేసి బ్రెయిన్‌ డెత్‌గా నిర్ధారించారు. శ్రీరాములు భార్య వసంత, తల్లిదండ్రుల అంగీకారం మేరకు అవయవదానానికి ముందుకు వచ్చారు. జీవన్‌ధాన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.రాంబా బు, ఆస్పత్రి డైరెక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. కాలేయం, ఒక కిడ్నీ మణిపాల్‌ ఆసుపత్రిలో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. మరొక కిడ్నీని గుంటూరులో వేదాంత ఆసుపత్రికి తరలించారు. శ్రీరాము లు కుటుంబానికి మణిపాల్‌ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.