Jul 07,2023 00:18

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ మానవ మూత్రపిండాలు, లివర్‌ కాకినాడ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్‌కు సకాలంలో చేరేలా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసిన ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌కు కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయి ట్రస్ట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు తిరిగి కోలుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఆ యువకుని కుటుంబ సభ్యులు అతడి అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఒక కిడ్నీ కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌కు మరొక కిడ్నీని విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరొకరికి అమర్చటానికి కాకినాడ ట్రస్ట్‌ ఆసుపత్రి నుంచి విశాఖపట్నం కిమ్స్‌ -ఐ కాన్‌ ఆసుపత్రికి అత్యవసరముగా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా తరలించారు. ఊపిరితిత్తులను హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్‌ వరకు అంబులన్స్‌లో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా తరలించారు.