కడప అర్బన్ : కాంట్రాక్టు ఉద్యోగుల మాది రిగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యు లర్ చేయాలని ఎపి మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ అవుట్ సోర్సి ంగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, సుదర్శన్ డిమాండ్ చేశారు. గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్) ఒపి బ్లాక్ ఎదుట నాల్గవ రోజు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులకు కాం ట్రాక్టు ఉద్యోగులకు ఎడ్యుకేషన్‌లో ఏమా త్రం తేడాల్లేవని, వారు పనిచేసే విధా నంలో కూడా తేడాల్లేవని, వారికి ఇచ్చే వేత నాల్లో తేడాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం 2014, జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీస్ పూర్తయిన అందరినీ రెగ్యులర్ చేస్తా మని చెప్పిందన్నారు. ఇది సంతోషించాల్సిన విషయమని తెలిపారు. ఆ పద్ధతిలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యు లర్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మి నెంట్ అయ్యేంత వరకూ ఆప్కాస్ ఉద్యో గులకు పనికి తగ్గ వేతనం అమలు చేయా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఆప్కాస్ కార్మికులకు అమలు చేయాలని పేర్కొన్నారు. ఆప్కా స్‌లో పనిచేస్తున్న తల్లి దండ్రులకు వృద్ధాప్య, వికలాంగుల పెన్ష న్లను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వాటిని వెంటనే పున రుద్దించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఆప్కాస్‌లో పనిచేస్తూ విక లాంగులుగా ఉన్నారో వారి పింఛన్లు కూడా రద్దు చేయడం దారుణమని చెప్పారు. అమ్మ ఒడికి సంబంధించి ఆప్కాస్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ వేతనం తీసుకుంటున్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకు మాత్రం అమ్మఒడి పడిందని, ఆప్కాస్ ఉద్యోగుల పిల్లలకు మాత్రం అమ్మఒడి పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులని సాకు చూపిస్తూ అమ్మ ఒడి పడడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం ఆప్కాస్ ఉద్యోగులను పర్మినెంట్ చే యాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో యూనియన్ ఉపాధ్యక్షులు భాస్కర్, బాలా జీ రావు, ఏసన్న, రామకృష్ణ, చెన్నయ్య, కార్య దర్శులు కొండయ్య, సురేష్, రాజా రత్నం, కమిటీ సభ్యులు జయరాం, సుబ్బా రావు, లక్ష్మయ్య, బాదుల్లా, పవన్, మరియమ్మ, జయసుధ, రిమ్స్ కార్మికులు పాల్గొన్నారు.










