Jul 08,2023 21:21

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌

కడప అర్బన్‌ : కాంట్రాక్టు ఉద్యోగుల తరహాలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ ఔట్సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో 6వ రోజు కడప జిజిహెచ్‌ ఓపి బ్లాక్‌లో చెవిలో పువ్వులు పెట్టు కుని గంటసేపు నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అవుట్సోర్సింగ్‌లో థర్డ్‌ పార్టీ ఉన్నందున దోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. ఆప్కాస్‌ చేస్తే నేరుగా ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి కార్మికులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పడం ఆప్కాస్‌ కార్మికులందరికీ చెవులలో పూలు పెట్టడమే విమర్శించారు. ఆప్కాస్‌ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఎడ్యుకేషన్‌లో ఏమా త్రం తేడా లేదన్నారు. పని చేసే విధానంలో కూడా తేడా ల్లేవు కానీ వారికి ఇచ్చే వేతనాల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. జూన్‌ 2 2014, జూన్‌ 2 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్‌ పూర్తయిన వారిని అందరిని రెగ్యులర్‌ చేస్తా మని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సంతో షించాల్సిన విషయం అన్నారు. ఆ పద్ధతిలోనే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆప్కాస్‌లో పనిచేస్తున్న తల్లి దండ్రులకు వద్ధాప్య, వికలా ంగుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. వాటిని వెంటనే పునరుద్దించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. వెంకటసుబ్బయ్య, పి.వి. సుదర్శన్‌, కోశాధికారి ఎల్వి రమణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్‌. భాస్కర్‌, బి.బాలా జీరావు, ఏసన్న, రామకష్ణ, చెన్నయ్య, కార్యదర్శులు కొండయ్య, సురేష్‌, రాజారత్నం, కమిటీ సభ్యులు జయరాం, సుబ్బారావు, జయసుధ, రిమ్స్‌ కార్మికులు పాల్గొన్నారు.