టన్నెల్ పనులను తెలుసుకుంటున్న అడిషినల్ డిజిపి
అవుకు టన్నెల్‌ను అడిషనల్ డిజిపి సందర్శన
ప్రజాశక్తి - అవుకు
గాలేరు నగరి సుజల స్రవంతి వరద కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా అవుకు మండలంలో నిర్మిస్తున్న రెండు సమాంతర సొరంగాలను రాష్ట్ర అదనపు డిజిపి మాదిరెడ్డి ప్రతాప్ శుక్రవారం సందర్శించారు. అవుకు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై రమేష్ రెడ్డిలతో కలిసి ఆయన టన్నెల్‌లో జరుగుతున్న పనుల వివరాలను అక్కడి ఎస్‌ఆర్‌బిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న మూడవ టన్నెల్ వివరాలను కూడా తెలుసుకొని అక్కడి నుండి అవుకు జలాశయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో అవుకు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










