Jul 13,2023 17:28

సచివాలయంలో ఉద్యోగికి వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు

ఆవుదూడ వంక బ్రిడ్డి ఎత్తు పెంచాలి : సిపిఎం

ప్రజాశక్తి - ఆదోని

ఆదోని పట్టణంలో రాంజల్ల దగ్గర నుండి రాయ నగర్‌ వరకు ఉన్న ఆవు దూడ వంక మురుగు కాలువ బ్రిడ్జి ఎత్తు పెంచాలని పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ నాయకులు వెంకటేశులు, వీరేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో 33వ వార్డు సచివాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఆవు దూడ వంక మురుగు కాలువ ఇరువైపులా జీవనం సాగిస్తున్న ప్రజలు వర్షాకాల సీజన్లో భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. బ్రిడ్జి కింద భాగాన ఉన్న రంద్రాలు చిన్నవిగా ఉండటంతో మురుగు నీటితోపాటు చెత్త, చెదారం రంద్రాలకు అడ్డుపడి మురుగునీరు ఇళ్లల్లోకి వస్తోందని అన్నారు. సచివాలయం పరిధిలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు.