
ప్రజాశక్తి-అవనిగడ్డ : అవనిగడ్డలో జనసేన టిడిపి కార్యకర్తల ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా సందర్భంగా వారిపై ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడికి పాల్పడినందుకు నిరసనగా శనివారం బందుకు పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రధాని రహదారులన్నీ పోలీసు వలయంలో ఉన్నాయి. కాగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులను మూసి వేస్తుండగా పోలీసులు కవాతు నిర్వహిస్తూ అవనిగడ్డలో బందు లేదని వ్యాపారస్తులు స్వేచ్ఛగా షాపులు తెలుసుకొని వ్యాపారం చేసుకోవచ్చని ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ కొందరు వ్యాపారస్తులు షాపులను తెరవలేదు. అయితే బాష్పవాయు ప్రయోగించే వజ్రవాహనంతో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించారు. మరోవైపు టిడిపి జనసేన పార్టీలకు చెందిన ప్రధాన నాయకులను గహనిర్బంధం చేయగా జనసేన పార్టీకి చెందిన మండల పార్టీ నాయకుడు గుడివాడ శేషుబాబును అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి సాయంత్రం విడుదల చేశారు.