ప్రజాశక్తి -తగరపువలస : డొమైన్‌లోని విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చే లక్ష్యంతో స్థానిక అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌తో, ఆక్విటీ సొల్యూషన్స్ సంస్థ బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అవగాహన పత్రాలు పరస్పర మార్పిడి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆక్విటీ సొల్యూషన్స్ అధ్యక్షులు, సిఇఒ కశ్యప్ జోషి మాట్లాడుతూ, డిజిటల్ స్కైబ్ హెల్త్‌కేర్‌లో అభివృద్ధి చెందుతున్న మెడికల్ డాక్యుమెంటేషన్‌లో యువతకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. తమ కార్య కలపాలను విస్తరించే యోచనలో భాగంగా విశాఖలో త్వరలో అక్విటీ సొల్యూషన్స్ కొత్త బ్రాంచిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ బి శర్మ మాట్లాడుతూ, 2021-22 ఏడాదికి ఇక్కడి క్యాంపస్ నుంచి 20మంది ఫార్మసీ విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అవంతి ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎ చంద్రశేఖర్, ప్లేస్‌మెంట్ డీన్ డాక్టర్ టి శ్రీనివాస్ సమక్షంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంబివి రాజు, వైస్ ప్రిన్సిపాల్ వి.ఉమాశంకర్ కంపెనీ ప్రొఫైల్ గురించి వివరించారు.










