
ఓటర్ల జాబితా అవకతవకలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్న నరేంద్ర వర్మ
ప్రజాశక్తి - బాపట్ల: కొత్త ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని టిడిపి ఇన్‌చార్జి వేగేశన నరేంద్ర వర్మ కలెక్టర్ రంజిత్ బాషాకు బుధవారం ఫిర్యాదు చేశారు. సవరించిన ఓటర్ల జాబితాలో సుమారుగా 2వేలకు పైగా మరణించిన ఓటర్ల పేర్లు ఉన్నాయని తెలిపారు. మరో 2వేలకుపైగా తప్పుడు ఓట్లు, జీరో డోర్ నెంబరుపై ఉన్న ఓట్లు, ఒకే ఇంటి నెంబరుపై 10కంటే ఎక్కువ ఉన్న ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలోని అవకవతవకలపై తక్షణమే విచారణ జరిపించి ఓటర్ల జాబితాను సరిచేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వర్మతో పాటు టిడిపి పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఫరీద్ మస్తాన్ ఉన్నారు.