* పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
పలాస : వైసిపి సీనియర్ నాయకులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలో పార్టీ అభివద్ధికి కషి చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైసీపీ అధిష్టానం నియమించిన జిల్లా కార్యవర్గంలో పలాస నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బడగల బల్లయ్య (ప్రధాన కార్యదర్శి), దున్న సత్యం, తామాడ సరస్వతి, కుర గౌడ్, దేవరకొండ షణ్ముఖరావు (ఎగ్జిక్యూటివ్ సభ్యులు)లను, కార్యదర్శిగా దల్లి జానకిరావు, ఉపాధ్యక్షులు పాలిన శ్రీనివాసరావు, జిల్లా వాణిజ్య విభాగపు అధ్యక్షులుగా బెల్లాల శ్రీనివాసరావు, సాంస్కతిక విభాగపు అధ్యక్షలుగా ఉప్పరపల్లి ఉదరు కుమార్‌కు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకులకు పార్టీ గురుతర బాధ్యతలను అప్పగించిందని, పార్టీలో కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికి పదవులు రావని, కష్టపడే తత్వం ఉన్నవారికి అవి వరిస్తాయని అన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 17 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారని, 2019లో జరిగిన ఎన్నికల్లో తాను సుమారు 17 వేల ఓట్లతో విజయం సాధించడం వెనుక పార్టీ కార్యకర్తల కషి ఎంతో ఉందన్నారు. పలాస నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కషి చేయాలని, గతంలో జిల్లా కార్యవర్గంలో పని చేసిన నాయకులకు పదవులు రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్లో మరెన్ని పదవులు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైసీపీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.










