Apr 25,2023 01:23
అవినీతిపై ఖాజాస్వామి పోరాటం

ప్రజాశక్తి-పంగులూరు: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, చుట్టుపక్కల గ్రామాలకే ఆదర్శంగా నిలిచిన నూజిల్లపల్లి గ్రామాన్ని, అవినీతి అక్రమాలతో కుంభకోణాలమయంగా చేసి అవినీతి గ్రామంగా మార్చారని ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అవినీతిపరులను శిక్షించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, జిల్లా స్థాయి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, దీంతో అధికారులను కదిలించేందుకు, అవినీతిపరుల ఆట కట్టించేందుకు తాను నిరాహార దీక్ష చేస్తున్నానని ఆ గ్రామానికి చెందిన గొట్టిపాటి ఖాజాస్వామి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పంగులూరులోని వేణుగోపాలస్వామి దేవాలయం పక్కన ఉన్న ఆడిటోరి యంలో నిరాహార దీక్షను ప్రారంభించారు. దోషులను శిక్షించేంతవరకు తన పోరాటం ఆగదని కాజాస్వామి తెలిపారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునే వరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. కాజా స్వామి చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా సోమవారం చందలూరు బాబురావు, పెంట్యాల శ్రీనివాసరావు, చందలూరి రాజీవ్‌ శాస్త్రి, చందలూరు రాజయ్య, మద్దినేని సుబ్బారావు, మద్దినేని రామకృష్ణులు దీక్షలో కూర్చున్నారు.