
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం అవినీతి లేని సమ సమాజం ఏర్పాటు కోసం ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే ఒఎన్‌జిసి వాకథాన్ కార్యక్రమం నిర్వహిస్తుందని ఒఎన్‌జిసి ఇడి, అసెట్ మేనేజర్ అమిత్ నారాయణ్ అన్నారు. మంగళవారం ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో వాకథాన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, సత్యం వెల్లివిరిసే వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ 'వాకథాన్' ఒక అడుగు అన్నారు. బాధ్యతాయుతమైన కార్పొరేషన్‌గా, ఒఎన్‌జిసి విజిలెన్స్ విభాగం ద్వారా ప్రతి సంవత్సరం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచనల మేరకు 'విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్' నిర్వహిస్తుందన్నారు. ఏడాది 'సే నో టు కరప్షన్ కమిట్ టు ది నేషన్' అనే థీమ్ అనే పేరుతో అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్ నిర్వహిస్తుందన్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇటీవల తన లంచ నిరోధక నిర్వహణ వ్యవస్థ కోసం ధృవీకరణ పొందిన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా చరిత్ర సృష్టిం చిందని ఆయన తెలి పారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సర్టిప ˜ికేషన్ బాడీ ఇంటర్‌సర్ట్ యుఎస్‌ఎ ద్వారా ఈ సర్టిఫికేషన్ లభించిందని వివరించారు. పారదర్శకతను నిర్ధారించడానికి ఒఎన్‌జిసి నిబద్ధత 2005లో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ ప్రారంభించిన సమగ్రత ఒప్పందాన్ని స్వీకరించిన భారతదేశంలో మొదటి సంస్థగా అవతరించిందన్నారు. 'విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్' ప్రచారం అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 8న ముగుస్తుందని తెలిపారు.