Nov 02,2023 22:25

ప్రజాశక్తి - టి.నరసాపురం
   ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సిజిజిబి విజిలెన్స్‌ అధికారి ఇ.రాంబాబు తెలిపారు. మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ విజిలెన్స్‌ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్‌ అందిస్తున్న సేవలను ఖాతాదారులకు తెలిపారు. సమాజంలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం కూడా అవినీతిగానే భావించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిజిజిబి ప్రధాన కార్యాలయ విజిలెన్స్‌ అధికారి విజరు కుమార్‌, రీజనల్‌ మేనేజర్‌ మల్లేశ్వరరావు, మేనేజర్‌ వినరు కుమార్‌ పాల్గొన్నారు.