అవగాహన ర్యాలీలో ఎసిబి అడిషనల్ ఎస్‌ఫి శ్రావణి
ప్రజాశక్తి -భీమునిపట్నం : అవినీతికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ బ్యూరో విశాఖ డివిజన్ ఆధ్వర్యాన మంగళవారం స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ గంటస్తంభం మీదుగా బీచ్‌కు చేరుకుంది. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎసిబి అడిషనల్ ఎస్‌పి శ్రావణి, ఇన్‌స్పెక్టర్లు కిషోర్‌కుమార్, ప్రేమ్‌కుమార్, రామకృష్ణ, స్థానిక సిఐ కె.లక్ష్మణమూర్తి, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.










